పదవ తరగతి విద్యార్థులకు బండి సంజయ్ చేయూత

 

పదవ తరగతి విద్యార్థులకు బండి సంజయ్ చేయూత

12,292 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు
బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి

ఇల్లందకుంట, నవంబర్ 11: కేంద్ర సహాయక మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన జీతం మొత్తాన్ని పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపుకు వినియోగించి, విద్యార్థులకు చేయూతనందించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు చెక్కులను అందజేసినట్లు ఇల్లందకుంట మండల బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి తెలిపారు.

మంగళవారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ రెడ్డి తెలిపారు: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12,292 మంది పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులు మంత్రి బండి సంజయ్ వ్యక్తిగతంగా చెల్లించారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

అంతేకాకుండా, త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాబోయే విద్యాసంవత్సరంలో "మోడీ కిడ్స్" పేరుతో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, వాటర్ బాటిల్స్ వంటి అవసరమైన పాఠశాల సామగ్రిని అందజేయనున్నట్లు చెప్పారు.

చదువుకుంటున్న ఉమ్మడి జిల్లాల విద్యార్థుల తరపున మంత్రి బండి సంజయ్ కుమార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన బండి సంజయ్ సేవా భావం విద్యా అభివృద్ధికి దోహదం చేస్తోందని పవన్ రెడ్డి అన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.