జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళులు
విద్యతో సమాజంలో వెలుగును నింపుదాం నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలిద్దాం
హైదరాబాద్, నవంబర్ 11: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన మహానుభావుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారి, సామాజికవేత్త ఎం. శ్రీనివాస్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ,“విద్యతోనే సమాజంలో వెలుగు నింపవచ్చు. ప్రతి భారతీయుడు నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.
మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భారత విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన మహనీయుడు అని పేర్కొంటూ, ఆయన జాతీయవాద భావాలు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు విద్య ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ ఎం. శ్రీనివాస్ కుమార్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment