మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
హైదరాబాద్ : గాంధీభవన్‌లో సోమవారం స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్‌రావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ “మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శనీయం. ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పోషించిన పాత్ర అపూర్వం. దేశ నిర్మాణంలో విద్యను ప్రాధాన్యంగా తీసుకుని భారత భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. ఆయన చేసిన త్యాగాలు, పోరాట పటిమను యువతకు పరిచయం చేయడం సమాజ బాధ్యత” అని అన్నారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని మౌలానా ఆజాద్ సేవలను స్మరించారు.

Post a Comment