తండ్రిని నరికి చంపిన క్రూరుడు – మద్యం మత్తులో దారుణం

హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం కలకలం


విజయనగరం జిల్లా, బాడంగి మండలం: మానవత్వం మసకబారిన దారుణ ఘటన బాడంగి మండలంలోని గొల్లాది గ్రామంలో చోటుచేసుకుంది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రిని మద్యం మత్తులో కుమారుడు కత్తితో నరికి చంపిన విషాదకర సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

స్థానిక సమాచారం ప్రకారం, మామిడి సత్యం (62) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. అతని కుమారుడు రాము మద్యానికి బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం మద్యం మత్తులో తండ్రితో గొడవపడి, కోపోద్రిక్తుడైన రాము పదునైన కత్తితో దాడి చేసి తండ్రి తలను నరికి చంపాడు. తండ్రి తల, మొండెం వేరు చేసిన దారుణ దృశ్యం గ్రామస్థులను షాక్‌కు గురిచేసింది.

వార్త అందుకున్న బాడంగి ఎస్సై తారకేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు రామును అదుపులోకి తీసుకున్నారు.

గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు ఇలాంటి దారుణాలకు మద్యం వ్యసనం ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.