ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశం
కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ మండల కేంద్రంలో ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బా బాబు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసీ కొలవార్ సమాజానికి సంబంధించిన వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
సమావేశంలో పాల్గొన్న సంఘం జాతీయ అధ్యక్షులు సుంకే కిష్టయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య మాట్లాడుతూ “కొలవార్ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘పి.వి.టి.జి గుర్తింపు’పై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. కొమరం భీం, సిర్పూర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు మన సమస్యలను తెలియజేస్తూ మెమోరాండం సమర్పించనున్నాం” అని తెలిపారు.
ఇక 2026 జనవరి 8న జరగబోయే ఆదివాసీ కొలవార్ ఆవిర్భావ దినోత్సవం - 26వ జెండా పండుగ కార్యక్రమాన్ని అన్ని గ్రామ, మండల స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని జాతీయ, రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గంట గోపాల్, కుర్మ రాజు, పిట్టల రామస్వామి, కురుమ ప్రసాద్, ఆత్రం బక్కయ్య, మేకల శ్యామ్ రావు, కొడుపే వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే జిల్లా నాయకులు సత్తయ్య, బుర్రి రూపేష్, టేకం సురేష్, మేడి సతీష్, నాయిని సంతోష్, మైకల్ జాక్సన్ మరియు మండల నాయకులు ఆత్రం సత్తయ్య, చింతపొడి పోశం, గాట్ల శంకర్, మేకల ఫణిందర్, పూజారి సుగుణాకర్, దడ్డి విలాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment