మంచిర్యాల: కాలువలో పడి కొట్టుకుపోయిన డ్రైవర్ శ్రీకాంత్
మంచిర్యాల, నవంబర్ 09: మంచిర్యాల జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. రాజీవ్ నగర్‌కు చెందిన ఈటె శ్రీకాంత్ (డ్రైవర్) గరిడేపల్లి మండలం మర్రికుంట వద్ద సాగర్ ఎడమ కాలువలో పడి కొట్టుకుపోయాడు. వివరాల్లోకి వెళ్తే— చెన్నై నుండి సరుకుతో బయలుదేరిన శ్రీకాంత్, మర్రికుంట వద్ద లారీ నిలిపి తోటి డ్రైవర్లు, క్లీనర్లతో కలిసి అన్నం వండుకున్నాడు. అనంతరం చేతులు కాళ్లు కడుక్కోవడానికి కాలువ ఒడ్డునకు వెళ్లగా, తనకు ఈత వస్తుందని చెబుతూ కాలువలోకి దూకాడు. అయితే గట్టికి చేరుకునేలోపే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
సహచరులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. స్థానిక మత్స్యకారులను కూడా సహాయంగా తీసుకుని శ్రీకాంత్ కోసం శోధన కొనసాగిస్తున్నారు.
👉 ఈ సంఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యాపించింది.

Post a Comment