నవంబర్ 19వ తేదీన HMS హైదరాబాద్ సింగరేణి భవన్ ముట్టడి
శ్రీరాంపూర్ ఏరియా ప్రెస్ క్లబ్‌లో హెచ్.ఎం.ఎస్. (HMS) రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 19వ తేదీన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల వైఫల్యాన్ని, అలాగే మేనేజ్మెంట్ మొండి వైఖరిని నిరసిస్తూ హెచ్.ఎం.ఎస్. గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లను ప్రస్తావించారు:
🔹 9 నెలలుగా ఆగిపోయిన మెడికల్ బోర్డుని వెంటనే పునరుద్ధరించి, అప్లికేషన్ పెట్టుకున్న కార్మికులను “అన్‌ఫిట్” చేయాలని డిమాండ్ చేశారు.
🔹 150 మాస్టర్ల పేరుతో నెలకు అండర్‌గ్రౌండ్ 16, సర్ఫేస్ 20 మాస్టర్ల పేరుతో కార్మికులకు ఇబ్బందులు కలిగించే సర్కులర్లను వెంటనే రద్దు చేయాలి.
🔹 2024 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్నల్ క్లర్క్ నోటిఫికేషన్ను వెంటనే భర్తీ చేయాలి.
🔹 సింగరేణిలో మారు పేర్లు పెండింగ్‌లో ఉన్న వారసులకు ఉద్యోగాలను తక్షణమే ఇవ్వాలి.
🔹 పెరక్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలి.
🔹 సొంతింటి పథకంను అమలు చేయాలి.
🔹 సర్ఫేస్‌లో ఎన్నో సంవత్సరాలుగా డిప్యూటేషన్ మీద పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌గా చేసి, ఖాళీలను భర్తీ చేయాలి.
రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, “కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సింగరేణి మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన పరిస్థితి వచ్చింది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఎం.ఎస్. ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, ఏరియా నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment