తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత! వణికిస్తున్న ఉదయాలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత! వణికిస్తున్న ఉదయాలు


హైదరాబాద్, నవంబర్ 09: ఇటీవల వరకు వర్షాలు దంచికొట్టిన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చలి పంజా విసురుతోంది. “మొంథా” తుపాను ప్రభావం తగ్గడంతో వర్షాలు ఆగినా, వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకూ చలిగాలులు విరుచుకుపడుతున్నాయి.

రాష్ట్రంలోని అదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, ములుగు, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ చలి నమోదవుతోంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది.

వాతావరణ శాఖ ప్రకారం, మరిన్ని 10–15 రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం తీవ్రంగా ఉంది. శనివారం ఉదయం అత్యల్పంగా 14.9°C ఉష్ణోగ్రత నమోదైంది. నగర పరిసరాల్లో పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గుతోంది.

నిపుణుల హెచ్చరికలు:

ఈ ఏడాది చలి తీవ్రత గత సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్న పిల్లలు, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.