వద్దిరాజు పై విమర్శలు సరికావు: మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి

వద్దిరాజు పై విమర్శలు సరికావు: మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి


కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవన్నపై జరుగుతున్న విమర్శలపై మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ఘాటుగా స్పందించారు. ఎన్నికల నేపథ్యంలో మున్నూరు కాపు సంఘం పేరుతో హడావిడి చేస్తున్నారని పసుపులేటి వీరబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తిరస్కరించాల్సినవని ఆమె అన్నారు.

"హడావిడి చేయని నాయకుడు… ప్రజా నాయకుడు"

వద్దిరాజు రవన్న ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడని, ఎవరికైనా అవసరం వచ్చినా ముందుండే వ్యక్తి అని సీతాలక్ష్మి పేర్కొన్నారు.“అయనకు కుల–మతాలతో ఎలాంటి విభేదాలు లేవు. ఎవరికైనా అవసరం ఉంటే వెంటనే చేరే ప్రజా నాయకుడు రవన్న. హడావిడి చేసే నేత అన్న వ్యాఖ్యలకు తావే లేదు” అని ఆమె అన్నారు.

మున్నూరు కాపు భవనం సందర్శనపై స్పష్టత

స్థానిక కాపు సంఘ పెద్దల ఆహ్వానం మేరకే రాజ్యసభ సభ్యుడు మున్నూరు కాపు భవనాన్ని సందర్శించారని, భవన నిర్మాణానికి అవసరమైన సహకారం అందించేందుకు ముందుంటున్నారని సీతాలక్ష్మి తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని, ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా ఇవ్వలేని పరిస్థితే ఉందని ఆమె అన్నారు.“బీసీ ఉపకులాలు కాంగ్రెస్ వైపే ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటు” అని ఆమె వ్యాఖ్యానించారు.

"స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్‌చార్జిగా పర్యటిస్తే ఎందుకు భయం?"

రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జిగా జిల్లాలో పర్యటిస్తే కొంతమంది నాయకులు ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు అర్థమైందని ఆమె అన్నారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని, విమర్శలు చేసే ముందు స్వీయ పరిశీలన చేసుకోవాలని సీతాలక్ష్మి మండిపడ్డారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.