మూడు నెలలు పెళ్లిళ్లకు బ్రేక్! శుక్ర మూఢంతో శుభముహూర్తాల కొరత
ఇప్పటి నుంచి శుభకార్యాలన్నీ బ్రేక్ పడినట్టే. పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు, గృహప్రవేశాలు పెట్టుకోవాలనుకునే కుటుంబాల్లో ఆందోళన పెరిగింది. కారణం… శుక్ర మూఢం. పండితుల ప్రకారం దాదాపు 83 రోజులపాటు శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు లేవట.
నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకు—మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ మాస బహుళ అమావాస్య వరకూ—శుక్ర మౌఢ్యమి కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ కాలంలో శుక్రుడు, గురుడు సూర్యుడికి అత్యంత సమీపంగా ఉండటం వల్ల వీటిని బలహీనంగా పరిగణిస్తారు. అందుకే వివాహాలు, గృహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్ఠలు వంటి శుభకార్యాలు నిర్వహించరని పండితులు సూచిస్తున్నారు.
అయితే నిత్యకర్మలు, తప్పనిసరి కార్యక్రమాలకు మూఢమి వర్తించదు.
ప్రతి ఏడాది మాఘమాసంలో పెళ్లిళ్లు క్యూల్లో ఉండే పరిస్థితి. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఏవి ఖాళీగా ఉండేవి కావు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా రివర్స్. మాఘమాసం మొత్తం మూఢమి ఉండటంతో ఈసారి ముహూర్తాలే లేక, బుకింగ్స్ కూడా లేవని హాల్ నిర్వాహకులు వాపోతున్నారు. అందుకే… పెళ్లి ముహూర్తం కోసం మూడు నెలలు కాస్త ఆగాల్సిందే!

Post a Comment