అంబేడ్కర్ స్ఫూర్తితో యువతలో రాజ్యాంగ అవగాహన పెంచాలి : న్యాయవాది మొహీద్ పటేల్
నారాయణఖేడ్, నవంబర్ 27: 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నారాయణఖేడ్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బాబా ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో AIMIM అధ్యక్షుడు న్యాయవాది మొహీద్ పటేల్ పాల్గొని ప్రసంగించారు.
న్యాయవాది పటేల్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దేశ ప్రజలకు సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి ప్రజాస్వామ్య విలువలను అందించిన మహనీయుడని పేర్కొన్నారు. అంబేడ్కర్ సేవలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు.
యువతలో రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచేందుకు ప్రతి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలి అని పటేల్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మార్గదర్శకత్వం చేసే జీవన చట్టమని, యువత దాని ఆత్మను అర్థం చేసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువజన సంఘాలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment