క్రీడా స్ఫూర్తిని చాటిన దివ్యాంగులు కొత్తగూడెంలో ఉల్లాసంగా జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు

క్రీడా స్ఫూర్తిని చాటిన దివ్యాంగులు కొత్తగూడెంలో ఉల్లాసంగా జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రగతి మైదానంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడా పోటీలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా జెండా ఊపి, బెలూన్లను ఆకాశంలోకి ఎగురవేసి పోటీలను ప్రారంభించారు.

దివ్యాంగులు ఏ క్రీడలోనైనా ముందుండి రాణించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆమె తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి శిక్షణను అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా దివ్యాంగుల్లో శారీరక సామర్థ్యంతో పాటు ఆత్మవిశ్వాసం, మానసిక ఉల్లాసం పెరుగుతుందని పేర్కొన్నారు.


పోటీలలో విజేతలు

షాట్ పుట్: సందీప్, అనిత, అఖిల్, సాయి కౌశిక్, రవి
జావెలిన్ త్రో: రవి, సావిత్రి, అఖిల్, మోక్షిత్
రన్నింగ్: సందీప్, అనిత, అఖిల్, నాగరాజు, హేమంత్ చౌదరి
క్యారమ్ బోర్డు: శైలు, సందీప్, ప్రవీణ్, రాజు


హాజరైన ముఖ్యులు

ఈ కార్యక్రమంలో సిడిపిఓ పద్మశ్రీ, పి.ఇ.టి.లు నరేష్, మంగీలాల్, మదన్, బావ్ సింగ్, జిల్లా దివ్యాంగుల సంఘ నాయకులు సతీష్, నయీం, ప్రవీణ్, రాజేందర్, ముజాహిద్దీన్, అలాగే ప్రత్యేక పాఠశాలల నిర్వాహకులు ప్రసాద్, అరుణ, నాగలక్ష్మి, గౌతమి, సుబ్బలక్ష్మి, కార్యాలయ సిబ్బంది వరప్రసాద్, నాగేశ్వరరావు, నరేష్, ప్రవీణ్, దివ్యాంగులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


దివ్యాంగుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రోత్సహించాలని పాల్గొన్న అన్ని వర్గాల వారు అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.