లారీ ఢీకొని బాలుడు మృతి – విషాదంలో ఆల్గాం గ్రామం

లారీ ఢీకొని బాలుడు మృతి – విషాదంలో ఆల్గాం గ్రామం


మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆల్గాం గ్రామంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి వివాహానికి వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో విషాదాన్ని నెలకొల్పింది.

ఆల్గాం గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య, ఆయన భార్య, కుమారుడు సాత్విక్ బైక్‌పై ఇంటికి వస్తుండగా కత్తెరసాల దగ్గర వేగంగా వచ్చిన లారీ వారి బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సాత్విక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాజయ్యకు, ఆయన భార్యకు స్వల్ప గాయాలు కాగా, సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ విషాద ఘటనపై గ్రామస్తులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.