కొత్త లేబర్ కోడ్ల అమలుపై HMS ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన
గోదావరిఖని–హైదరాబాద్–న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా హింద్ మజ్దూర్ సభ (HMS) ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జిలతో మంగళవారం నిరసన తెలిపారు.
దశాబ్దాలుగా అమలులో ఉన్న కార్మిక చట్టాలకు బదులుగా కేంద్రం నాలుగు నూతన లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. వీటిలో వేతనాల కోడ్–2019, సామాజిక భద్రతా కోడ్–2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్–2020, పారిశ్రామిక సంబంధాల కోడ్–2020 ఉన్నాయి. నవంబర్ 21న విడుదలైన కేంద్ర ప్రభుత్వ గెజిట్‌కు నిరసనగా రామగుండం–3 ఏరియాలోని ఓపెన్ కాస్ట్–1 వద్ద పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది.
ఈ కార్యక్రమానికి HMS జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కోడ్లు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నల్ల రిబ్బన్ ధరించి కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమాన్ని ఉపాధ్యక్షుడు శాంతి స్వరూప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎ.ఎల్.పి. పిట్ సెక్రటరీ రాజశేఖర్, డంపర్ ఆపరేటర్లు–డ్రిల్ ఆపరేటర్లు జహీరుద్దీన్, శ్రీధర్, కె. శ్రీనివాస్, బి. నరేష్, జె. ఇలయ్య, పి. సమ్మయ్య, ఇ. రాయలింగు, బి. సురేందర్, కె. రమేష్, బాలకృష్ణ, జి. నాగరాజు, జబ్బార్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment