తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవుల ఖరారు విద్యార్థుల్లో ఆనందం
హైదరాబాద్ : నవంబర్ 22: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు దాదాపు ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం జనవరి 10 నుండి 15, 2026 వరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయని సమాచారం.
ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సంక్రాంతి సెలవులను ప్రకటించింది. 2026 జనవరి 10 నుండి 18 వరకు విద్యాసంస్థలు మూతపడనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
సంక్రాంతి సమయానికి గ్రామాలు సందడిగా మారే నేపధ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు ఈ రెండు రాష్ట్రాల నిర్ణయాలు సహాయపడనున్నాయి.

Post a Comment