మిత్రుని కుటుంబానికి పదో తరగతి స్నేహితుల ఆర్థిక సాయం
జమ్మికుంట మండలం నాగంపేట గ్రామానికి చెందిన సోమల్ల హరీష్ ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసి దుర్మరణం చెందడం గ్రామస్తులను కలిచివేసింది. ఈ నేపథ్యంలో హరీష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పదో తరగతి స్నేహితులు ముందుకు వచ్చారు.
ఈరోజు మిత్రుడు పల్లెర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పదో తరగతి బ్యాచ్ మిత్రులు, స్థానిక విద్యార్థి నాయకులు కలిసి హరీష్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపుతూ, తమ వంతు సహాయంగా ₹26,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పదో తరగతి మిత్రులు బొమ్మిదేని అజయ్, కనుమల్ల వెంకటేష్, కుర్రి అభిషేక్, బుర్ర వంశీతో పాటు విద్యార్థి నాయకులు సింగిరెడ్డి రంజిత్ రెడ్డి, గట్టు సాయిరాం, సందీప్ పాల్గొన్నారు.

Post a Comment