దివ్యాంగుల సంఘం నాయకుడు నర్సింలు మృతి – తీరని లోటు
మెదక్ జిల్లా, నార్సింగి: నవంబర్ 13: మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుల సంఘం నాయకుడు ర్యాల నర్సింలు (50) గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను కొంపల్లి సమీపంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూనే గురువారం ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడు నర్సింలు వెనుక భార్య, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దివ్యాంగుల పెన్షన్ల పెంపు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
నర్సింలు అకాల మరణం పట్ల జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు పాండు, రాష్ట్ర దివ్యాంగ మహాసమితి కార్యదర్శి శ్రీనివాస్ చారి, ఎన్‌పీఆర్డీ ప్రతినిధి అడివయ్య, జిల్లా నాయకులు దేవరాజు, జగ్గారి నర్సింలు తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.
“దివ్యాంగుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నర్సింలు మృతి తీరని లోటు,” — శ్రీనివాస్ చారి, రాష్ట్ర కార్యదర్శి, దివ్యాంగ మహాసమితి

Post a Comment