బైక్‌ దహనం కేసులో నిందితుడికి రిమాండ్‌

 

బైక్‌ దహనం కేసులో నిందితుడికి రిమాండ్‌

వెల్దుర్తి, మెదక్ జిల్లా — నవంబర్ 13: వెల్దుర్తి మండలంలోని కుక్నూరు గ్రామంలో జరిగిన బైక్‌ దహనం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నవంబర్‌ 10న గ్రామంలో ఒక బైక్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో దహనమైంది. ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తు సమయంలో సంఘటనా స్థలాన్ని పోలీసులు సమగ్రంగా పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజీతో పాటు ఇతర సాక్ష్యాధారాలను సేకరించారు. రెండు రోజుల్లోనే ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీశారు. విచారణలో బనాపురం గ్రామానికి చెందిన మధు తండ్రి నరసింహులు బైక్‌ను ఉద్దేశపూర్వకంగా దహనం చేసినట్లు తేలింది.

నిందితుడు నరసింహులను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విషయంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్దుర్తి పోలీస్‌ అధికారులు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.