చైతన్యం డ్రగ్స్‌పై యుద్ధం ర్యాలీని విజయవంతం చేయండి — కాపు సీతాలక్ష్మి

చైతన్యం డ్రగ్స్‌పై యుద్ధం ర్యాలీని విజయవంతం చేయండి — కాపు సీతాలక్ష్మి


కొత్తగూడెం, నవంబర్ 13 : భద్రాద్రి జిల్లాలో గంజాయి సహా మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు చేపట్టిన “చైతన్యం డ్రగ్స్‌పై యుద్ధం” కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు లక్ష్మీదేవి పల్లి మార్కెట్‌యార్డు నుంచి కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వరకు జరిగే ముగింపు ర్యాలీని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె కోరారు.

మత్తు పదార్థాల ప్రభావం నుంచి యువతను దూరంగా ఉంచడం సమాజ బాధ్యత అని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని సీతాలక్ష్మి పిలుపునిచ్చారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.