ఆదివాసుల భూముల జోలికి వస్తే సహించేది లేదు రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య

ఆదివాసుల భూముల జోలికి వస్తే సహించేది లేదు రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య

ఆదివాసుల భూముల జోలికి వస్తే సహించేది లేదుఆదివాసీ కోలవార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య 

కొమరం భీం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి వినతిపత్రం సమర్పించిన ఆదివాసీ కోలవార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య మరియు బాధితులు.

ఈ సందర్భంగా బుర్స పోచయ్య మాట్లాడుతూ —"కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన నేర్పెల్లి పొశం, కన్నేపెల్లి బాపు, కన్నేపెల్లి పోశం లకు చెందిన పూర్వీకుల భూములను మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కనుకుంట్ల రమణ మరియు బెంగాలీ వ్యక్తి కౌశిక్ అక్రమంగా ఆక్రమించుకున్నారు. మా ఆదివాసీ కొలవార్ ల భూములను భూకబ్జా చేస్తూ, వారు దున్నుకునేందుకు వెళ్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు," అని తెలిపారు.

అలాగే, ఆయన ప్రభుత్వం మరియు పోలీసులు వెంటనే స్పందించి భూకబ్జాదారులపై SC, ST అఘాయిత్య నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, బాధితుల భూములను తిరిగి అప్పగించాలన్నారు.

"ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే తుడుం దెబ్బ మరియు ఆదివాసీ కోలవార్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం," అని బుర్స పోచయ్య గారు హెచ్చరించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.