వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక – విద్యార్థులు నిబద్ధతతో సమాజానికి సేవ చేయాలి

వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక – విద్యార్థులు నిబద్ధతతో సమాజానికి సేవ చేయాలి


వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక – విద్యార్థులు నిబద్ధతతో సమాజానికి సేవ చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

కొత్తగూడెం, నవంబర్ 3: వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక అని, ఇది కేవలం ఉద్యోగం కాకుండా సమాజానికి అంకితమైన పవిత్ర బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ అన్నారు.

సోమవారం కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్తగా ఎంపికైన MBBS విద్యార్థుల వైట్ కోట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ విద్యార్థులను ఆశీర్వదిస్తూ ప్రసంగించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “మీ చేతుల్లోనే సమాజ ఆరోగ్య భవిష్యత్తు ఉంది. రోగుల పట్ల కరుణ, సహానుభూతి, అంకితభావం కలిగి వైద్య సేవ చేయడం ప్రతి వైద్య విద్యార్థి ధర్మం. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణలో యువ వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమైనది,” అన్నారు.

అలాగే ఆయన విద్యార్థులను ఉద్దేశించి, “మీరు రాబోయే రోజుల్లో దేశ వైద్య రంగానికి మూలస్థంభాలు అవుతారు. ఈ దశలోనే క్రమశిక్షణ, సమయపాలన, మానవతా దృక్పథం, ప్రజల పట్ల బాధ్యత వంటి విలువలను అలవర్చుకోవాలి. వైట్ కోట్ కేవలం వస్త్రం కాదు – ఇది నైతికత, సేవ, నిబద్ధతలకు ప్రతీక,” అని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు వైద్య నైతిక ప్రమాణాల పట్ల నిబద్ధతతో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం 150 మంది నూతన వైద్య విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా తెల్లకోటును అందజేశారు.

కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. శ్రీహరి రావు, కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాధామోహన్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.