చేవెళ్ల బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మోహీద్ పటేల్
చేవెళ్ల బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మోహీద్ పటేల్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఖానాపూర్ స్టేజీ సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదంపై నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు, న్యాయవాది మోహీద్ పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటన హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్న ఆయన, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోహీద్ పటేల్, మృతుల కుటుంబాల పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Post a Comment