హార్ట్ ఎటాక్‌తో మల్ల ప్రమీల మృతి – దిశా ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
ta9vanita ప్రతినిధి నవంబర్ 09 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మహిళల సంక్షేమం కోసం సేవలందిస్తున్న దిశా ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఫౌండేషన్ సామాజిక బాధ్యతను చాటుకుంది. సంస్థ చైర్మన్ వాసర్ల నాగమణి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు రెంటపల్లి మాధవి లత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల హార్ట్‌ఎటాక్‌తో మృతి చెందిన రాస మల్ల ప్రమీల గారి కుటుంబాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు పరామర్శించారు. మృతురాలి భర్త సైదులు గారిని ధైర్యం చెప్పి, ఆయనకు ఆర్థిక సహాయం అందజేసి, రోజువారీ అవసరాల సరుకులను అందించారు.
రెంటపల్లి మాధవి లత మాట్లాడుతూ “సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తోడుగా నిలవడం దిశా ఫౌండేషన్ ధ్యేయం. మానవతా దృక్పథంతో ప్రతి మహిళ, ప్రతి కుటుంబం సురక్షితంగా జీవించేందుకు ఫౌండేషన్ కట్టుబడి ఉంది” అని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ ఇటుకల మాధవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భోగాలక్ష్మి, సెక్రటరీ స్వరూపతో పాటు దిశా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment