జమాఅతె ఇస్లామీ హింద్ ‘పొరుగు వారి హక్కులు’ కార్యక్రమంలో మహిళా వక్తల సందేశం
ఆదర్శ పొరుగు వారితోనే ఆదర్శ సమాజం సాధ్యం
జమాఅతె ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా నవంబర్ 21 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న నెయిబర్స్ రైట్స్ క్యాంపెయిన్‌లో భాగంగా, స్థానిక కార్యాలయంలో మహిళా మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కార్యదర్శి ఇష్రత్ బాను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొని పొరుగు వారి హక్కులపై తమ విలువైన సందేశాలు అందించారు.
ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ మేయర్ ఫాతిమా జుహార మాట్లాడుతూ,“పొరుగువారు బంధువులు కావచ్చు, అపరిచితులు కావచ్చు… వారందరిపట్ల ఉదారంగా, సహానుభూతితో వ్యవహరించడం మన సామాజిక బాధ్యత. మిత్రులు, బాటసారులు, మన ఆధీనంలో ఉన్న వారందరికీ సానుభూతి చూపడమే ఆదర్శ వ్యక్తిత్వ లక్షణం” అని అన్నారు.
మరో ముఖ్య అతిథి, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ రెహనా,“సత్సమాజ నిర్మాణానికి శాంతియుత, సమైక్య జీవనం అత్యవసరం. అందుకు ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనలో సత్యనిష్ఠ, పొరుగువారితో సత్సంబంధాలు కాపాడుకోవాలి” అని సూచించారు.
డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు ఇతరుల భావాలను గౌరవించడం, పొరుగువారితో పంచుకోవడం వంటి విలువలను బోధించాలని ఆమె అన్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి ఇష్రత్ బాను మాట్లాడుతూ,
“వేగవంతమైన పట్టణ జీవితం, అపార్ట్‌మెంట్ సంస్కృతి కారణంగా ఒకప్పుడు కుటుంబంలా ఉన్న పొరుగువారితో సంబంధాలు క్రమంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో జమాఅతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు ‘ఆదర్శ పొరుగు – ఆదర్శ సమాజం’ పేరుతో ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ప్రచారం ద్వారా పొరుగువారి మధ్య నైతిక విలువలు, మానవ బంధాలు మరింత బలపడతాయి” అని అన్నారు.
విశిష్ట అతిథుల సందేశాలు
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా అమ్మ ఆశ్రమం ప్రెసిడెంట్ వి. మంజుల, పిరమిడ్ సేవాదళ్ కురపాటి శ్రీలత, **

Post a Comment