అకాల వర్షాల కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన నష్టాలను వెంటనే పరిష్కారించాలి సీపీఐ డిమాండ్

అకాల వర్షాల కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన నష్టాలను వెంటనే పరిష్కారించాలి సీపీఐ డిమాండ్


సదాశివపేట, నవంబర్ 23: ఇటీవలి అకాల వర్షాల కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన నష్టాలను వెంటనే పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సదాశివపేటలో జరిగిన సమావేశంలో రైతు సంఘం నాయకురాలు టీ. బుజమ్మా, నాయకురాలు ఎం. గంగమ్మ కలిసి మాట్లాడుతూ, “అకాల వర్షాలు వరి, మిరప, పత్తి పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. పండించిన పంట మొత్తం నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

పంట నష్టాలను దృష్టిలో ఉంచుకుని, నష్టపోయిన ప్రతి ఎకరాకు ₹30,000 నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని వారు స్పష్టం చేశారు. “దేశంలోని ప్రతి రంగానికి తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించే హక్కు ఉండగా, రైతులకే మాత్రం నిత్యం అన్యాయం జరుగుతోంది. ఎన్నికల సమయంలో మాత్రమే రైతులను గుర్తు చేసుకుంటారు; ఎన్నికలు పూర్తయ్యాక సమస్యలు మాత్రం ఎప్పటికీ పరిష్కారం కానట్లే ఉంటాయి” అని ఇద్దరు నాయకులు విమర్శించారు.

అకాల వర్షాలు కొట్టిన దెబ్బ రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చిందని, జిల్లాలో పంటలు పూర్తిగా నాశనమై రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు అండగా నిలవాలని, పంట నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రాజమ్మ, పూలమ్మ (లంబాడి), శాంతమ్మ, సాదిక్ అలీ, దేవి బాయ్, మంజుల తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.