భారీ గంజాయి సీజ్ రూ.1.52 కోట్ల విలువైన 304 కేజీల నిషేధిత గంజాయి స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | డిసెంబర్ 24, 2025: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పోలీసులు భారీ స్థాయిలో నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దమ్మపేట పోలీసులు మరియు Telangana Eagle Force (RNCC ఖమ్మం) సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.1.52 కోట్ల విలువైన 304 కేజీల గంజాయి పట్టుబడింది.
🔍 విశ్వసనీయ సమాచారం మేరకు ఆపరేషన్
ఈ రోజు (24-12-2025) ఉదయం 10.00 గంటల ప్రాంతంలో, అచ్చుతాపురం గ్రామ క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో రాజమండ్రి నుంచి సతుపల్లి వైపు వెళ్తున్న
TATA Motor Goods Container (TN 73 AD 9515)
Maruti Suzuki Ertiga Car (MH 14 EC 5834)
వాహనాలను పోలీసులు ఆపి తనిఖీ చేపట్టారు.
🚛 సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయి
కంటైనర్ వాహనం క్రింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన సీక్రెట్ ఛాంబర్ లో
👉 152 గంజాయి పాకెట్లు (ఒక్కొక్కటి సుమారు 2 కేజీలు)
👉 మొత్తం బరువు: 304 కేజీలు
👉 అంచనా విలువ: రూ.1,52,00,000/-
గంజాయి దాచి తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఎస్కార్ట్ వాహనంగా ఉపయోగించిన ఎర్టిగా కారుకు నకిలీ నెంబర్ ప్లేట్ (AP 14 EC 5834) అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
🧾 విచారణలో కీలక నిజాలు
విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ సమీపంలోని బానందులి గ్రామం వద్ద సాదు గురుజి అనే వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు రాజమండ్రి వరకు కారులో తరలించి అక్కడ నుంచి కంటైనర్‌లో సీక్రెట్ ఛాంబర్ ద్వారా అశ్వారావుపేట – సతుపల్లి – విజయవాడ మార్గంగా చెన్నైకి చెందిన గంజాయి స్మగ్లర్ విక్రమ్ కు సరఫరా చేయాలనే ప్లాన్ ఉన్నట్లు వెల్లడైంది.
⚖️ కేసు నమోదు వివరాలు
Crime No: 326/2025
PS: దమ్మపేట
NDPS Act సెక్షన్లు:
8(c) r/w 20(b)(ii)(C)
27(A), 29
🚔 సీజ్ చేసిన వస్తువులు
304 కేజీల గంజాయి
TATA కంటైనర్ లారీ
మారుతి సుజుకి ఎర్టిగా కారు
5 మొబైల్ ఫోన్లు
నగదు రూ.4,500/-
👥 అరెస్టు చేసిన నిందితులు (4)
వంతల ఏమలయ్య (29) – విశాఖపట్నం (ట్రాన్స్పోర్టర్)
అర్జున్ బి (25) – తిరువళ్లూర్, తమిళనాడు (డ్రైవర్)
షణ్ముగం ఎం (28) – తమిళనాడు (స్టూడెంట్)
దేవాకర్ (19) – తమిళనాడు (స్టూడెంట్)
🕵️♂️ పరారీలో ఉన్న నిందితులు (4)
విక్రమ్ (35) – చెన్నై (రిసీవర్)
సాదు గురుజి (60) – ఒరిస్సా (సప్లయర్)
జె. సుబ్రమణ్యం – కంటైనర్ యజమాని (తమిళనాడు)
వికాశ్ అంకుష్ తంగేడి – ఎర్టిగా కారు యజమాని (మహారాష్ట్ర)
🏛️ రిమాండ్‌కు తరలింపు
పట్టుబడిన నలుగురు నిందితులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
👮♂️ ఎస్పీ అభినందనలు
నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకున్నందుకు అశ్వారావుపేట CI నాగరాజు, దమ్మపేట SI సాయి కిషోర్ రెడ్డి, Telangana Eagle Team (RNCC ఖమ్మం) మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు IPS ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment