సత్తుపల్లి JVR ఓపెన్ మైన్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్
సత్తుపల్లి పట్టణంలోని జలగం వెంగళరావు (JVR) ఓపెన్ మైన్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ నేడు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మైన్‌లోని బొగ్గు ఉత్పత్తి విధానం, రవాణా వ్యవస్థ, సిబ్బంది పని పరిస్థితులు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఆయన విపులంగా సమీక్ష నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు మైన్‌లోపల పర్యటించి, ప్రతి విభాగం పనితీరుపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
బొగ్గు ఉత్పత్తి పరిమాణం, మార్కెట్‌లో ఉన్న ధరలు, బొగ్గు రవాణాలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై కూడా డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ప్రశ్నించి సమాచారం సేకరించారు.
అనంతరం కోల్ డిస్పాచ్ సెంటర్‌ను సందర్శించిన భట్టి విక్రమార్క్, అక్కడి నుంచి బొగ్గు రవాణా జరుగుతున్న విధానాన్ని పరిశీలించి, వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాలంటూ అధికారులకు సూచనలు చేశారు.

Post a Comment