సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కల్వకుంట్ల కవిత
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి కుటుంబ సభ్యులకు HMS గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత, HMS అధ్యక్షులు రియాజ్ అహ్మద్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి సిరుల మాగాణిగా నిలుస్తున్న సింగరేణి సంస్థ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ కల్పవల్లిగా మారిందని వారు పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర రైతాంగానికి, పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలుస్తున్న సంస్థగా సింగరేణి ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలిపారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో సింగరేణి సంస్థది కీలకమైన పాత్రని, కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న సంస్థగా మరింత అభివృద్ధి సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సింగరేణి కుటుంబ సభ్యులందరికీ మరోసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment