గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు
టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
కొత్తగూడెం, డిసెంబర్ 22: కొత్తగూడెం నియోజకవర్గం, చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండా గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవి అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా పని చేసి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన నూతన పాలకవర్గానికి సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆయన, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ మాజీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్, కొత్తగూడెం ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్, జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు శివ, మురళి, కోటేష్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment