2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ మహబూబ్ జాని

2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ మహబూబ్ జాని


భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముస్లిం మైనార్టీ బీసీ ఈ–ఫోర్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ మహబూబ్ జాని కొత్తగూడెం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, రాబోయే నూతన సంవత్సరం కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో అన్ని రంగాల్లో అహర్నిశలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాజపట్ల బాధ్యతాయుతంగా మెలుగుతూ, మరెన్నో విజయావకాశాలను సొంతం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అందరూ నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతూ సుఖసంతోషాలతో నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరుతూ, ఆయన మరోసారి ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.