జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎస్సీ సంక్షేమ మంత్రిని కలిసిన గజ్జె రాజ్‌కుమార్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎస్సీ సంక్షేమ మంత్రిని కలిసిన గజ్జె రాజ్‌కుమార్


జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం, డిసెంబర్ 31:
తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఎస్సీ కులాల స్టేట్ యూత్ ప్రెసిడెంట్, దళిత రత్న అవార్డు గ్రహీత గజ్జె రాజ్‌కుమార్ గారు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులను సాల్వతో సన్మానించి, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

ప్రత్యేకంగా ఎస్సీ హాస్టళ్లలో జరుగుతున్న దాడులు, అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తున్న హాస్టల్ వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి ఒక మెమోరండం అందజేశారు. దీనికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.