న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులకు ఉచిత రవాణా సేవలు: TGPWU కీలక నిర్ణయం
హైదరాబాద్ | డిసెంబర్ 31: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) కీలకమైన మానవతా నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ పార్టీల్లో మద్యం తాగిన వారు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేందుకు ఉచిత రవాణా సేవలను అందిస్తున్నట్లు యూనియన్ ప్రకటించింది.
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా
- క్యాబ్‌లు
- ఆటోలు
- ఎలక్ట్రిక్ బైక్‌లు
కలిపి మొత్తం 500 వాహనాలను సిద్ధం చేసినట్లు TGPWU ప్రతినిధులు వెల్లడించారు. న్యూఇయర్ పార్టీల అనంతరం ఉచిత రైడ్ అవసరమైన వారు 8977009804 నంబర్‌ను సంప్రదించాలని యూనియన్ సూచించింది.
మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రాణనష్టం, ప్రమాదాలను నివారించి ప్రజల భద్రతను కాపాడడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని TGPWU పేర్కొంది. నగర వాసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నూతన సంవత్సరాన్ని ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని యూనియన్ ఆకాంక్షించింది.
తాగి డ్రైవ్ చేయకండి – ఉచిత రైడ్ తీసుకుని సురక్షితంగా ఇంటికి చేరండి అని యూనియన్ మరోసారి విజ్ఞప్తి చేసింది.

Post a Comment