“నా పైసలు నాకు ఇచ్చేయండి”… ఓటర్లపై ఓడిపోయిన అభ్యర్థి ఆగ్రహం

“నా పైసలు నాకు ఇచ్చేయండి”… ఓటర్లపై ఓడిపోయిన అభ్యర్థి ఆగ్రహం


మహబూబాబాద్ : తెలంగాణలో గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు బయటకొచ్చాయి. గెలిచిన అభ్యర్థులు సంబురాల్లో మునిగితేలుతుండగా, కొందరు ఓటమిపాలైన అభ్యర్థులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచి కూడా ఓడిపోయామని బాధపడుతూ తమ ‘ఖర్చు’ తిరిగి ఇవ్వాలని కోరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి సంఘటన మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో వెలుగుచూసింది. సర్పంచ్ పదవికి భూక్యా కౌసల్య పోటీ చేయగా, ఆమెకు 27 ఓట్ల తేడాతో ఇస్లావత్ సుజాత గెలుపొంది సర్పంచ్ కుర్చీ కైవసం చేసుకుంది.

తన ఓటమికి ఆగ్రహించిన కౌసల్య, గ్రామస్తులపై ఆక్షేపణలు చేస్తూ “తమనకోసం డబ్బులు ఇచ్చినా ఓటు వేయలేదని” ఆరోపిస్తూ, ఇంటింటికీ వెళ్లి తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే “జెండా పట్టుకుని ప్రమాణం చేయాలి” అని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొని, ఓటర్లు–ఓడిపోయిన అభ్యర్థి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.