కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి అనంతలక్ష్మి నామినేషన్
ఉమ్మడి పెనగడప గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి అనంతలక్ష్మి నామినేషన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని వెంకటేష్ ఖని–వనమా నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి అనంతలక్ష్మి ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు అచ్చ నగరాజు ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల అభ్యర్థులు కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా అచ్చ నాగరాజు మాట్లాడుతూ “ఉమ్మడి పెనగడప ప్రాంతంలో ఉన్న నాలుగు గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం మా లక్ష్యం. అభివృద్ధి–సమగ్ర సేవ మా ధ్యేయం” అని పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Post a Comment