నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలకు బల్లల పంపిణీ

నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలకు బల్లల పంపిణీ


పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, పాల్వంచ వారు తమ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం డెస్క్‌లు (బల్లలు) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ & జడ్పీ సీఈఓ బి. నాగాలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. సంస్థ ద్వారా పలు ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ప్రయోగశాలలు, ప్రయోగ పరికరాలు అందించడమే కాకుండా, విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు ఉచిత ట్యూషన్ సదుపాయం కల్పించడమూ ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు.

అంతేకాకుండా, మరుగుదొడ్ల సౌకర్యం లేని 39 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం వాష్‌రూములు, హ్యాండ్‌వాష్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నవ భారత్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు నిజంగా గొప్పవని ఆమె ప్రశంసించారు.

అనంతరం నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ (CSR) ఎం.జి.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ, ఇప్పటివరకు సంస్థ తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం 4,500 డెస్క్‌లు (బల్లలు) అందించామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరామ్మూర్తి, నవ భారత్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.వి.కె. ప్రసాద్, నవ భారత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి. జ్యోతి, రాజేశ్వరరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.