జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్


లీగల్ న్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో డిసెంబర్ 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ మరియు కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ/కాంప్రమైజ్ ద్వారా త్వరితగతిన పరిష్కరించడానికి లోక్ అదాలత్ కీలక వేదికగా నిలుస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు మరియు శ్రమ గణనీయంగా ఆదా అవుతుందని పేర్కొన్నారు.

జిల్లాలో పెండింగ్ కేసుల ఉపశమనం కోసం లోక్ అదాలత్‌ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

ఈ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకునే అవకాశం ఉన్న కేసుల జాబితా:

  1. యాక్సిడెంట్ కేసులు
  2. సివిల్ కేసులు
  3. చీటింగ్ కేసులు
  4. చిట్ ఫండ్ కేసులు
  5. భూ తగాదాలకు సంబంధించిన కేసులు
  6. వివాహ బంధానికి సంబంధించిన కేసులు
  7. చిన్నచిన్న దొంగతనం కేసులు
  8. ట్రాఫిక్ చాలాన్‌లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
  9. కుటుంబ తగాదాలు
  10. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కేసులు
  11. టెలిఫోన్ బకాయిల కేసులు
  12. కొట్టుకున్న కేసులు
  13. సైబర్ క్రైమ్ కేసులు (రాజీ సాధ్యమైనవి)
  14. చెక్ బౌన్స్ కేసులు

డిసెంబర్ 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని తమ కేసులను పూర్తిగా క్లోజ్ చేసుకునే విలువైన అవకాశాన్ని వినియోగించుకోవాలని కక్షిదారులకు న్యాయ సేవాధికార సంస్థ సూచించింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.