మహదేవపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కొత్తవడ్ల మళ్లీశ్వరి మధుకర్ నామినేషన్
మహదేవపూర్ గ్రామం – రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా యువ మహిళ నాయకురాలు కొత్తవడ్ల మళ్లీశ్వరి మధుకర్ పోటీ చేస్తున్నారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ పలు విద్యార్థి ఉద్యమాల్లో భాగమైన ఆమె, తర్వాత బీజేపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో నిరంతరం పనిచేశారు.
గ్రామస్థుల సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిరంతరం ముందుండి పనిచేస్తాననే నమ్మకంతో పోటీ రంగంలోకి దిగుతున్నట్లు మళ్లీశ్వరి తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, పింఛన్లు, గ్రామ సాధారణ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో నిలబడ్డానని ఆమె పేర్కొన్నారు.
సామాన్య ప్రజల సమస్యలకు స్పందించడమే తన ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామస్తుల సహకారం అవసరమని మళ్లీశ్వరి మధుకర్ అభిప్రాయపడ్డారు.
మహదేవపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఉత్సాహభరితంగా కొనసాగుతుండగా, స్థానిక ప్రజల నుంచి అభ్యర్థుల ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది.

Post a Comment