పవిత్ర గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకూ 12 రోజుల మహోత్సవం
హైదరాబాద్ | డిసెంబర్ 13: పవిత్ర గోదావరి నదీ పుష్కరాలకు శుభ ముహూర్తం ఖరారైంది. 2027 సంవత్సరంలో జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకూ గోదావరి పుష్కరాలు ఘనంగా జరగనున్నాయి. మొత్తం 12 రోజుల పాటు ఈ మహాపర్వం కొనసాగనుంది.
📅 పుష్కరాల ముఖ్య తేదీలు
- పుష్కరాల ప్రారంభం: 2027 జూన్ 26
- పుష్కరాల ముగింపు: 2027 జూలై 7
పురాణాల ప్రకారం గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరగే మహోత్సవం. బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించే సమయంలో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి.
ఈ పుష్కర కాలంలో గోదావరి నదిలో స్నానం చేయడం, పూర్వీకులకు పిండప్రదానం, దానధర్మాలు చేయడం అత్యంత పవిత్రమని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు గోదావరి తీరాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, వ్రతాలు, దానాలు నిర్వహించనున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ పుష్కర శోభతో కళకళలాడనున్నాయి. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.

Post a Comment