ఖాన్ఖాయే గరీబ్ నవాజ్ దర్గా షరీఫ్ డిసెంబర్ 27, 28 కొత్తగూడెం ఉర్సు ఉత్సవాలు

ఖాన్ఖాయే గరీబ్ నవాజ్ దర్గా షరీఫ్ డిసెంబర్ 27, 28 కొత్తగూడెం ఉర్సు ఉత్సవాలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, వెంకటేశ్వర కాలనీలో ఉన్న ప్రసిద్ధ ఖాన్ఖాయే గరీబ్ నవాజ్ దర్గా షరీఫ్ లో నిర్వహించనున్న ఉర్సు ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 27వ తేదీన, సందల్ గధం జనాబ్ షేక్ నయీమ్ సాహెబ్ చిస్తీ గృహం రామ టాకీస్ నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, భక్తుల నినాదాల మధ్య దర్గా షరీఫ్‌కు చేరుకోనుంది. ఫాతెహా అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు కలదు.

అదే విధంగా డిసెంబర్ 28వ తేదీన, ఉర్సు సందర్భంగా చాదర్ మరియు పూల ఊరేగింపు షేక్ జనాబ్ అజీమ్ పాషా చిస్తీ గృహం రామంజనేయ కాలనీ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి దర్గా షరీఫ్‌కు చేరుతుంది. అనంతరం ఫాతెహా కార్యక్రమం నిర్వహించనున్నారు. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం చేత ఖవ్వాలి కార్యక్రమం ఆకట్టుకోనుంది. అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయనైనది.

ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం మరియు తీర్థప్రసాదం పంపిణీ చేయనున్నట్లు దర్గా ఖాదీమ్ సయ్యద్ ఫకీరు అహ్మద్ చిస్తీ తెలిపారు. భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.