డిసెంబర్ 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం
హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంను ‘రెండు చుక్కలు – నిండు జీవితం’ నినాదంతో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఐదేళ్ల లోపు వయస్సు గల సుమారు 54 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38,267 పోలియో బూత్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు బూత్ల వద్ద టీకాలు వేయగా, అనంతరం రెండు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు.
పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత రాష్ట్రంగా నిలవడంలో ప్రజలంతా సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

Post a Comment