కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని HMS జాతీయ కార్యదర్శి మహమ్మద్ ఇస్మాయిల్ డిమాండ్
రామగుండం, డిసెంబర్ 09: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వతీకరించాలనే డిమాండ్‌తో Hind Mazdoor Sabha (HMS) జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రామగుండం-2 ఏరియా HMS కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇస్మాయిల్ నిజామి మాట్లాడుతూ, "గుర్తింపు సంఘం హోదాలో ఉన్న నాయకులు కాంట్రాక్ట్ కార్మికులను కార్వేపాకు లాగా పక్కకు నెట్టేశారు. ఎన్నికల సమయంలో 'నెలకే పర్మినెంట్ చేస్తాం, CMD దగ్గర కూర్చుంటాం, సమాన పనికి సమాన వేతనం ఇప్పిస్తాం' అని ప్రగల్బాలు పలికిన నాయకులు ఇప్పుడు ఎక్కడ?" అని ప్రశ్నించారు.
అలాగే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్యతను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు.
"కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాల మీదికి వచ్చి వారి జీవనోపాధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే… గుండెల్లో తన్నిపంపే శక్తి కాంట్రాక్ట్ కార్మికులకు ఉంది. వారు ఉసురు తాకితే ఆ పళ్లు ఊడిపోతాయి," అని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు.
తమ హక్కుల కోసం కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా నిలబడాలని, HMS అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ALP ఇంచార్జి & వైస్ ప్రెసిడెంట్ శాంతి స్వరూప్, బ్రాంచ్ సెక్రటరీ గోషిక శ్రీకాంత్, ALP పిట్ రివెల్రీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment