₹2.50 లక్షల లంచం డిమాండ్… ₹1 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురు అధికారులు
రంగారెడ్డి జిల్లా | జనవరి 07: ఫిర్యాదిదారునికి సంబంధించిన నాలుగు ప్లాట్లలో ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసి, చెల్లించాల్సిన రుసుము మొత్తాన్ని కూడా చెల్లించినప్పటికీ, తదుపరి ప్రక్రియను పూర్తి చేసి అనుమతి మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలానికి చెందిన
- మండల పరిషత్తు అభివృద్ధి అధికారి (MPDO) పొన్న సుమతి,
- మండల పంచాయతీ అధికారి వడ్త్యావత్ తేజ్ సింగ్,
- ఎదులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆవుల చెన్నయ్య
ఫిర్యాదిదారుని నుండి మొత్తం రూ.2,50,000/- లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.1,00,000/- తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తెలంగాణ ఏసీబీ అధికారులు, ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు భయపడకుండా తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు.
👉 ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment