సింగరేణి కార్పొరేట్ పలు సమస్యలు కల్వకుంట్ల కవిత దృష్టికి
హైదరాబాద్ జనవరి 07: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్పొరేషన్‌కు సంబంధించిన పలు కీలక సమస్యలను హైదరాబాద్ జాగృతి అధ్యక్షురాలు, హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి దృష్టికి hms రియాజ్ అహ్మద్ నాయకత్వంలో తీసుకెళ్లిన హెచ్‌ఎంఎస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్.
ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక సంక్షేమ అంశాలు, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు, కార్పొరేట్ స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలను వివరించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
దీనిపై స్పందించిన కల్వకుంట్ల కవిత కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గడిపల్లి కృష్ణ ప్రసాద్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment