భూ బాధితురాలు రమాదేవి ఇంటిని సందర్శించిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి

భూ బాధితురాలు రమాదేవి ఇంటిని సందర్శించిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి


కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లి, గుండ్ల హనుమాన్ ఆలయం సమీపంలో భూ బాధితురాలు రమాదేవి నివాసంలో ఇటీవల జరిగిన పేలుళ్ల ఘటనపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రమాదేవి ఇంటిపై జరిగిన ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, కూల్చివేతలు, దాడులు మరియు పేలుళ్లకు సంబంధించిన అన్ని అంశాలపై పోలీస్, రెవెన్యూ, మునిసిపల్‌తో పాటు అటవీ శాఖ అధికారులు పూర్తి నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి చట్టపరంగా తగిన న్యాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పక్షాన నిలబడి, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని జస్టిస్ చంద్రకుమార్ భరోసా ఇచ్చారు. చట్టరీత్యా న్యాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రఘువీర్, సతీష్, రమేష్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గుర్రాల రవీందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.