సిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఘనంగా కేక్ కటింగ్

 

సిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఘనంగా కేక్ కటింగ్

సదాశివపేట | జనవరి 1: సదాశివపేటలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజుద్దీన్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎం. తాజుద్దీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘ నాయకులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయుష్షు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, మనం చేపట్టే పోరాటాలు విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇటువంటి మతోన్మాద శక్తుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోదరభావంతో కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత, సామరస్యం కొనసాగినప్పుడే దేశానికి భవిష్యత్ ఉంటుందన్నారు.

చివరిగా ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి. షఫీ, మండల కార్యదర్శి పాండు, ఎం. రమేష్, సాదిక్ అలీ, ముస్తఫా, యాకూబ్, అడ్వకేట్ ప్రభాకర్, గంగమ్మ, రాజమ్మ, లడ్డు లక్ష్మి, జ్యోతి, దేవిబాయి, బి. పాషా, శివలీల, శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.