సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ తుమ్మల యుగంధర్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ తుమ్మల యుగంధర్


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారిని డాక్టర్ తుమ్మల యుగంధర్  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను ముఖ్యమంత్రికి తెలియజేశారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు మరింత విజయవంతంగా కొనసాగాలని డాక్టర్ తుమ్మల యుగంధర్  ఆకాంక్షించారు. అలాగే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డాక్టర్ తుమ్మల యుగంధర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొని సమాజానికి సేవ చేయాలని సూచించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.