దేశ సంస్కృతిని కాపాడుకుందాం: సిపిఐ ముగ్గుల పోటీలు
సదాశివపేట: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో సదాశివపేట సిపిఐ పట్టణ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పురం రమాదేవి, కటకం సప్న చేతుల మీదుగా విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజద్దీన్ మాట్లాడుతూ, ప్రస్తుతం యువత ప్రపంచీకరణ ప్రభావంతో భారతీయ సంస్కృతిని మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడటం, తెలియని వయసులో నేరాలకు పాల్పడటం వల్ల వారి భవిష్యత్తు నశిస్తున్నదని పేర్కొన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్నో ఏళ్లుగా సంస్కృతి పరిరక్షణ, యువతలో చైతన్యం కల్పించేందుకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన వంతు కృషి చేస్తోందని తెలిపారు. అలాగే ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు కళా ప్రదర్శనలు, సదస్సులు, సెమినార్లు నిర్వహించి యువతను సంస్కృతి పట్ల ఆకర్షించేలా ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ షఫీ అహ్మద్, సత్యమ్మ, అనుసుజా, గంగమ్మ, సాధకాలి యాకూబ్, పూలమ్మ, వినోద, మంజుల, రజిని, లక్ష్మి, బిపాషా, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment