ఆదివాసీల ఆత్మీయుడు ప్రొఫెసర్ హైమండార్ఫ్ వర్థంతి ఘనంగా నిర్వహించిన నాయకులు

ఆదివాసీల ఆత్మీయుడు ప్రొఫెసర్ హైమండార్ఫ్ వర్థంతి  ఘనంగా నిర్వహించిన నాయకులు


కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్ క్రిస్టఫర్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ వర్థంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నాయకులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆదివాసి కొలవార్ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షులు మానేపల్లి మల్లేష్ మాట్లాడుతూ, 1909 జూన్ 22న జన్మించిన హైమండార్ఫ్ 1930లో లండన్ విశ్వవిద్యాలయం నుండి ఆంత్రోపాలజీలో డాక్టరేట్ పొందారని తెలిపారు. అనేక దేశాలను సందర్శించి స్థానిక ఆదివాసీ తెగల జీవన విధానాలు, సాంస్కృతిక పరిస్థితులను ఆయన లోతుగా అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో తన భార్య బేటీ ఎలిజబెత్‌తో కలిసి స్థిర నివాసం ఏర్పరుచుకుని గిరిజనుల మధ్య జీవిస్తూ వారి సమస్యలు, సంప్రదాయాలపై విశ్లేషణాత్మక పరిశోధనలు నిర్వహించారని చెప్పారు. గిరిజనుల అభ్యున్నతికి కృషి చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆత్మీయుడిగా హైమండార్ఫ్ చిరస్థాయిగా నిలిచారన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మిశ్రం రాజారాం, పెద్దల సంతోష్, సండ్ర మల్లేష్, సిడం వెంకటేష్, పెదం ధర్మయ్య, మైకల్ జాక్సన్, పెద్దల రవి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.