బాసరలో వసంత పంచమి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం

బాసరలో వసంత పంచమి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం


నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో జరగబోయే వసంత పంచమి (శ్రీ పంచమి) ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని అధికారికంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఈవో, ఆలయ అర్చకులు కలిసి ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాదేవత అయిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి అనుగ్రహం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

శ్రీ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వేద మంత్రోచ్ఛారణలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్సవాలకు హాజరైతే, కార్యక్రమాలకు మరింత వైభవం చేకూరుతుందని ఆలయ అధికారులు తెలిపారు..

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.