కొత్తగూడెం నగరపాలక సంస్థ పరిధిలో తుది ఓటర్ల జాబితా విడుదల

 

కొత్తగూడెం నగరపాలక సంస్థ పరిధిలో తుది ఓటర్ల జాబితా విడుదల

కొత్తగూడెం, జనవరి 12, 2026: కొత్తగూడెం నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 లోని సెక్షన్ 11, 12 నిబంధనలు అలాగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ జాబితాను ప్రచురించారు.

ఈ తుది ఓటర్ల జాబితా నగరపాలక సంస్థ కొత్తగూడెం కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం, రెవెన్యూ డివిజినల్ కార్యాలయం మరియు అదనపు కలెక్టర్ (LBs) కార్యాలయంలో ప్రజలకు పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు.

తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య ఈ విధంగా ఉంది:

👩 మహిళా ఓటర్లు – 70,314

👨 పురుష ఓటర్లు – 64,431

🧑‍🦽 ఇతరులు – 30

✅ మొత్తం ఓటర్లు – 1,34,775

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించి, ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.